All information about Vinaayakudu


వినాయకుడు అక్కడ బల్లాళేశ్వర్ గా ఎందుకు పూజలనందుకుంటున్నాడు:

vinayakudu information

              వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. కానీ బల్లాళేశ్వర్ గణపతి పేరు మీరు విని ఉండరు. అయితే ఇక్కడి ఆలయంలో స్వయంభూగా వెలసిన ఆ వినాయకుడికి ఆ పేరు ఎందుకు వచ్చినది? ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

              రాజాస్థానం రాష్ట్రంలోని దక్షిణభాగంలో దుంగర్భుర్జైళ్లకు పరిపాలన కేంద్రంగా దుంగర్భుర్ ఉంది. ఈ ఆలయం హిందూ, జైన ఆలయాలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలోనే బనేశ్వర దేవాలయం ఉంది. ఈ ఆలయంలో తాంత్రిక వినాయకుడు ఉన్నాడు.

             ఇక ఈ ఆలయం పురాణానికి వస్తే, ఆ పట్టణములో కల్యాణ్ అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు చాల ధనికుడు, భగవద్భక్తి కలవాడు. లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. ఆయన భార్య ఇందుమతి మహా పతివ్రత, సౌందర్యవతి. ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనికి బల్లాల్ అని నామకరణం చేశారు. అతడు చిన్న వయస్సునుండియే, గణపతిభక్తుడైయుండెను. బల్లాల్ ఒకనాడు తనతోడి బాలకులతో అడవికి వెల్లెను. అచ్చట బల్లాల్ ఒక పెద్ద రాయిని చూచి, దానిని గణపతి విగ్రహముగా భావించి, ప్రాణప్రతిష్టచేసి, పిల్లలందరితో కలిసి పూజలు చేయనారంభించెను.

                      అందరూ ఆ గణపతి విగ్రహమునకు బిల్వపత్రములతోను, దూర్వాయుగ్మముతోను పూజలు చేసిరి. జై గజానన్, జై గజానన్ అను నాదములు చేయుచు, చక్కని పాటలు పాడుచు, నృత్యములు చేయుచు, భక్తి పారవశ్యములో ఆకలి దప్పులను, వారి యిళ్ళను మరచిరి. కొన్ని రోజులు గడచినవి. కాని ఆ బాలురెవ్వరును తమయిండ్లకు తిరిగి రాలేదు. ఆ బాలుర తల్లిదండ్రులు చాల భయపడి కల్యాణ్వర్తకుని యింటికి వెళ్ళి తమ పిల్లలు ఇండ్లకు తిరిగి రాలేదని, బల్లాల్ వారందరిని ఎక్కడకో శ్రీసికొని వెళ్ళాడని, అతనిని నివారింపుమని, దుఃఖముతోను, భయముతోను, రోషపూరితముగాను మాట్లాడిరి.

               కల్యాణ్ వర్తకుడు కోపించిన వాడై, ఆ గ్రామముబయట పిల్లలందరు పూజ చేసికొనుచున్న ప్రదేశమునకు వెళ్ళి వారిపై ఆగ్రహించెను. పిల్లలందరును భయముతో పారిపోయిరి. కాని, బల్లాల్ మాత్రము తన ధ్యానములో నిమగ్నుడై యుండెను. ఆ వర్తకుడు కోపముతో బల్లాల్ను కొట్టి, చెట్టుకు కట్టి, గణపతి విగ్రహముగా పూజలు పొందుచున్న రాయిని పారవేసెను. అప్పడు పిల్లవాడైన బల్లాల్ విఘ్నేశ్వరుని  కొట్టినందుకు తండ్రి పై అతనికి ఇంచుకైనను కోపము రాలేదు. కాని గణపతి విగ్రహము పారవేయుట చూచి, సహింపలేక ఎవరు యిటు చేసిరో, వారు గ్రుడ్డి, చెవుడు, మూగ, గూని అగునని శపించెను.

             గణపతి పిల్లవాని భక్తికి మెచ్చి ఒక బ్రాహ్మణపిల్లవాని వలె దర్శనమిచ్చెను. అతని శరీరమును తాకెను. వెంటనే అతనిశరీరములోని నొప్పలన్నియుపోయి, అది బలమైన శరీరముగా మారినది. బల్లాల్ ఆ బ్రాహ్మణ బాలకుని విఘ్నేశ్వరుడని గ్రహించి, అతనిని పూజించెను. విఘ్నేశ్వరుడు సంతసించి బల్లాల్ ను వరము కోరుకొనుమనెను. విఘ్నేశ్వరునియందు అనన్యభక్తి కలిగి యుండునట్లను, ఆ స్థలమునందు విఫే్నుశ్వరుడు ఎల్లప్పడు వసించి, ప్రజల కష్టములను నివారణ చేయవలెననియు బల్లాల్వరమును కోరెను. వినాయకుడు అంగీకరించి, బల్లాలేశ్వర్ నామముతో స్వయంభూ విగ్రహరూపమును దాల్చి, అప్పటి నుండి భక్తుల కోర్కెలను, కష్టములను తీర్చుచుండెను. బల్లాల్ తన తండ్రిచే పారవేయబడిన రాతిని, డుండి వినాయక నామముతో అచ్చట ప్రతిష్టించెను. తరువాత, బల్లాల్ అచ్చట సర్వాంగ సుందరమైన మందిరమును గూడ నిర్మించెను.

            ఈవిధంగా వినాయకుడు తన భక్తుడి భక్తికి మెచ్చి అతనిపేరు మీదనే అచట స్వయంభూగా వెలసినాడు.

 వినాయకుడు ఆ కొండపైన స్వయంభుగా ఎందుకు వెలిశాడో తెలుసా:



              వినాయకుడుకి  దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే అయన ఇక్కడ కొండపైన స్వయంభుగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. సాధారణంగా వినాయకుడి ప్రతి ఆలయం భూమి మీదే దర్శనం ఇస్తుంది. కానీ ఇలా కొండపైన వినాయకుడు దర్శనం ఇచ్చే ఏకైక ఆలయం ఇదే అవ్వడం విశేషం. మరి వినాయకుడు అలా కొండపైన స్వయంభుగా కొలువై ఉండటానికి స్థల పురాణ గాధ ఏంటి? ఆ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

             తమిళనాడు రాష్ట్రము, తిరుచిరాపల్లి జిల్లా, టెప్పాకులం అనే ప్రాంతంలో రాక్ ఫోర్ట్ దేవాలయం ఉంది. ఈ ఆలయంలోనే వినాయకుడు కొండపైన స్వయంభుగా వెలిసాడు. తిరుచిరాపల్లినే ట్రిచీ అని అంటారు. అయితే రాక్ ఫోర్ట్  క్రింది భాగమున బ్రహ్మాండమైన కోనేరును నిర్మించారు దీన్ని తెప్పకుళం అంటారు. ఈ రాక్ ఫోర్ట్ కొండ భూమట్టం నుండి సుమారు 272 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ కొండకి దక్షిణ దిక్కున రాతిమెట్లు కట్టబడ్డాయి. ఇచట ఒక రాతి లింగం ఉంది భక్తులు దీనిని 'మలైకొళుందిశ్వరర్' అని పిలుస్తారు. ఒకే ఒక పెద్ద శిల నుండి పల్లవ శిల్పులు ఈ దేవాలయాన్ని అధ్బుతంగా మలిచారు.


            ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, సీతను బందీగా ఉంచడాన్ని రావణుని సోదరుడు విభీషణుడు తీవ్రంగా వ్యతిరేకించాడు. అప్పుడు వెంటనే రాముని వద్దకు వెళ్లి ఆశ్రయం పొందుతాడు. అయితే యుద్ధంలో రావణుడిని శ్రీరాముడు సంహరించిన తరువాత విభీషణుడు తనకు చేసిన సాయానికి గుర్తుగా రంగనాథుని విగ్రహాన్ని రాముడు ప్రదానం చేస్తాడు.
               
                 అయితే విభీషణుడు అసురుడు. దీంతో దేవతలు రంగనాథ విగ్ర‌హం శ్రీలంకకు చేరుకోకుండా అడ్డుకోవాలని నిర్ణయిస్తారు. ఇందు కోసం గణపతిని ప్రార్థిస్తారు. స్వామి ప్రత్యక్షమై వారి కోరికను తీరుస్తానని మాట ఇస్తారు. అయితే విగ్రహాన్ని నేల మీద పెడితే శాశ్వతంగా అక్కడే ఉండిపోతుంది. దీంతో అక్కడే పశువుల కాపరియైన బాలుడిని సాయం కోరుతాడు. 

                 అప్పుడు స్వామి విగ్రహాన్ని అక్కడ నుంచి తీయడం సాధ్యం కాలేదు. దీంతో ఆగ్రహంతో బాలుడిని పట్టుకోవాలని చూస్తాడు. ఆ సమయంలో బాలుడు వెంటనే పారిపోతాడు. అతన్ని పట్టుకోవాలని విభీషణుడు పరుగెత్తడం ప్రారంభించాడు. చాలాదూరం పరుగెత్తిన వినాయకుడు ఒక కొండపైకి వెళ‌తాడు.
         ఈవిధంగా వినాయకుడు రాక్ ఫోర్ట్ దేవాలయంలో స్వయంభూగా వెలిసి భక్తుల పూజలందుకొంటున్నాడు.

          

 వినాయకుడిని చింతామణి అని పిలవడం వెనుక కారణం ఏంటి:


          ప్రతి పూజలో ముందుగా వినాయకుడిని పూజిస్తారు ఎందుకంటే అయన సకల దేవతాగణములకు అధిపతి. అయితే వినాయకుడిని మనం గణపతి, విఘ్నేశ్వరుడు, గణేశుడు, గణనాయకుడు ఇలా అనేక రకాల పేర్లతో పిలుచుకుంటాము. అలా మనం పిలుచుకునే పేర్లలో చింతామణి అనే పేరు కూడా ఒకటి. మరి వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ పేరు పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

              పురాణ విషయానికి వస్తే, అభిజిత్‌ అనే రాజు ఉండేవాడు. అతనికి ఘనుడు అనే అతి దుష్టుడైన రాకుమారుడు ఉండేవాడు. ఆ రాకుమారుడు నిస్సహాయులుగా ఉన్న జనులను, మునులను ఎన్నో బాధలుపెట్టేవాడు. ఒకసారి వేటకోసం వనానికి వెళ్లిన ఘనుడు ఆ వనంలో ఉన్న కపిలముని ఆశ్రమానికి వెళ్లాడు. కపిలముని అతన్ని భోజనానికి ఆహ్వానించాడు. ఆ ముని కుటీరంలో మాకు ఎటువంటి భోజనం లభిస్తుంది అని ఘనుడు ఆలోచించ సాగాడు. అయితే కందమూలాలు, ఆకులు అలములు పెడతాడా! అని మనసులో అనుకున్నాడు.

                 కాసేపయ్యాక చూస్తే కుటీరం సమీపంలోనే ఒక మండపం కనిపించింది. వెళ్లి చూస్తే అందులో ఆసనాలు, వెండి పాత్రలు, రకరకాల ఆహారపదార్థాలు సిద్ధం చేసి ఉన్నాయి. కపిలముని ఎంతో ప్రేమగా ఘనుడికి, అతని సైన్యానికి భోజనం పెట్టాడు. ఆ వైభవం చూసి ఘనుడు ఆశ్చర్యపోయాడు. ఇంత తక్కువ సమయంలో అంత ఘనంగా ఏర్పాట్లు ఎలా చేశాడు అని ఆలోచించసాగాడు. ఆ విషయమే కపిలమునిని అడిగాడు. అప్పుడు కపిలముని నేను ఒకసారి ఇంద్రునికి సాయం చేశాను. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై నాకు చింతామణిని ప్రసాదించాడు అని చెప్పాడు. ఆ మణిని చూసిన ఘనుడు నాకు ఇవ్వమని అడిగాడు. అందుకు కపిలముని అంగీకరించలేదు.

               దాంతో ఘనుడు బలవంతంగా లాక్కున్నాడు. జరిగిన దానికి కపిలముని చాలా బాధపడ్డాడు. సహాయం కోరుతూ విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై గణేషున్ని ప్రార్థించమని చెప్పాడు. అప్పుడు కపిలముని ఘోర తపస్సు చేసి గణనాథుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. జరిగినదంతా చెబితే ఘునుడి దగ్గరి నుంచి మణిని తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాడు.

               అప్పుడు గణేషుడు తన సైన్యంతో వెళతాడు. అప్పుడు ఘనుడు తండ్రి మాట వినకుండా గణేషునితో యుద్ధానికి దిగుతాడు. చివరకు గణేషుడు పరసుతో ఘనుడి శిరస్సు చేధిస్తాడు. తరువాత ఘనుడి తండ్రి దగ్గర నుంచి చింతామణి తీసుకుని వచ్చి కపిలమునికి ఇస్తాడు. అప్పుడు కపిలముని ఆ చింతామణిని గణనాథుని మెడకు అలంకరించి ఈ చింతామణి మీదగ్గరే ఉండనివ్వండి. ఈనాటి నుంచి మిమ్మల్ని చింతామణి అని కూడా పిలుస్తారు అని చెప్పి నమస్కరించాడు. 

         ఈవిధంగా వినాయకుడికి చింతామణి అనే పేరు వచ్చిందని ఒక పురాణ కథ చెబుతుంది.

 వినాయకుడి తొండం విచిత్రంగా కుడివైపునకు తిరిగి ఉండే ఆలయం:


               ఏ పూజ చేయాలన్న మొదటగా వినాయకుడినే పూజిస్తాము. పార్వతీదేవి ముద్దుల తనయుడు బాలగణేశుడు. అయితే  చిన్న మందిరంగా వున్న ఈ ఆలయం కాలక్రమేణా దేశంలోనే అత్యధిక ఆదాయం కల ఆలయాల్లో ఒకటిగా వెలుగొందడం ఒక విశేషం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆయనను సిద్ది వినాయకుడు అని ఎందుకు అంటారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

            మహారాష్ట్ర రాష్ట్రంలోని ముంబై పట్టణంలోని ప్రభాదేవి ప్రాంతంలో సిద్ది వినాయక మందిరం ఉంది. 1801లో ఈ ఆలయాన్ని అగ్రిసమాజ్‌కు చెందిన ద్యూబయి పాటిల్‌ ఆర్థికసాయంతో కాంట్రాక్టర్‌ లక్ష్మణ్‌వితు పాటిల్‌ నిర్మించారు. ద్యూబాయి పాటిల్‌కు పిల్లలు లేరు. అయితే వినాయకుడి దర్శనం కోసం వచ్చే సంతానం లేని మహిళలకు సంతానం కలిగేలా చల్లనిచూపు చూడాలని ఆమె ఆ గణనాధున్ని ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఫలం వల్ల అనేకమంది సంతానం లేని మహిళలకు సంతానం కలగడంతో ఆ శంభుకుమారుని దివ్యమహత్తు దేశమంతటా వ్యాపించింది. దీంతో ఆయన దర్శనం కోసం వస్తున్న వేలమందితో మందిరం సందడిగా వుంటుంది. సిద్ధివినాయకుడిని సవసచ గణపతిగా భక్తులు పిలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చేవాడని మరాఠీ భాషలో దీనర్థం.

          పురాణానికి వస్తే, శ్రీ మహావిష్ణువు మధుకైటభులనే రాక్షసులతో యుద్ధం చేస్తూ వినాయకుడి సహాయాన్ని కోరాడు. శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు యుద్ధభూమిలో ప్రత్యేక్షమైన వినాయకుడు ఆ స్వామి దర్శనంతో రెట్టింపు బలాన్ని పొంది ఆ రాక్షసులని మట్టుబెట్టాడు. వినాయకుడి పాద స్పర్శతో కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ద క్షేత్రం అయింది. వినాయకుడి సహకారానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. స్వయంభూగా వెలసిన స్వామి విగ్రహానికి ఇరువైపులా సిద్ది, బుద్ది దేవతలు కొలువై ఉంటారు. అయితే ఇక్కడ విశేషం ఏంటి అంటే మిగతా క్షేత్రాల్లోని విగ్రహాలకు బిన్నంగా ఇక్కడ సామీ వారి తొండం కుడివైపునకు తిరిగి ఉంటుంది.

           సిద్ధివినాయక మందిరం దేశంలోని అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే
ఆలయాల్లో ఒకటిగావుంది. ఏటా హుండీ ద్వారా వచ్చే ఆదాయంలో కోట్లలో వుంటుంది. ఇంకా బంగారం కూడా ఎక్కువగా విరాళాల రూపంలో రావడం గమనార్హం. ఈ ఆదాయాన్ని పలు సాంఘికసేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

             ఈవిధంగా ఎన్నో విశేషాలు ఉన్న ఈ సిద్ధివినాయక మందిరం లోని వినాయకుడిని దర్శించుకొనుటకు రోజు రోజుకి భక్తుల సంఖ్య అధికం అవుతూ వస్తుంది.








                












Post a Comment

0 Comments