ఉదయం లేవగానే నీరు తాగాలని ఎందుకు అంటారో తెలుసా
ప్రతి రోజు 5 లీటర్ల నీటిని తప్పకుండ తాగాలని వైద్యులు సూచిస్తారు. శరీరానికి కావాల్సినంత
నీటిని అనేది తాగడం వలెనే శరీరంలో అన్ని అవయవాలు చురుగ్గా,
ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా ఉదయం లేవగానే నీటిని తాగడం చాలా మంచిదని
చెబుతున్నారు. మరి పరిగడుపున నీటిని తాగితే ఏం అవుతుంది? దాని వలన
ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు ఉన్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రోజు ఉదయం నీరు తాగడం వలన
శరీరం మొత్తం శుద్ధి చేయడం లో అది సహాయపడుతుంది. రాత్రి సమయంలో పడుకొని
విశ్రాంతిలో ఉన్నప్పుడు శరీర పనితనానికి కావాల్సిన ఇంధన శక్తిని, ఆ రోజు ఉదయం నుండి తీసుకున్న పోషకాలు, నీటి ద్వారానే ఆ
ఇంధనశక్తి అనేది లభిస్తుంది. అయితే ఉదయం
నీరు త్రాగటం వలన కేవలం 60 సెకన్లలో మీ
జీర్ణక్రియ ప్రారంభం అవుతుంది. ఒక పెద్ద గ్లాసు నీటిని తాగడం వలన 1.5 గంటల సమయంలో 24%వరకు జీర్ణక్రియ
రేటు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. రక్తంలో సేకరించిన మరియు శరీరమంతటా
సేకరించిన విష పదార్ధాలను వ్యర్థ రసాయనాలను మూత్రపిండాలు సేకరిస్తుంది. అలా
సేకరించిన వాటిని బయటకు పంపటానికి ఈ పద్ధతి దోహదం చేస్తోంది.
ఉదయము తగినంత నీటిని తాగకపోవటం
వలన చిన్నప్రేగు నుండి చెత్త నీటిని పెద్దప్రేగుకు తీసుకురావడాన్ని
అనుమతినిస్తుంది. కానీ, ఈ పద్ధతి వలన ఆ
నీటిని నిరోధిస్తుంది, అంతే కాకుండా
చర్మాన్ని రక్షిస్తుంది.
ఇంకా ఉదయం కొబ్బరి నీరు
తాగడం వలన పొట్ట యొక్క మధ్య భాగాన్ని కేలరీల వంటివి లేకుండా చేసి ఉదయం కావలసినంత
శక్తిని కలిగించి శరీరంలో శోషరస నాళ
వ్యవస్థ పనితీరును మరియు వ్యాధులతో
సమర్థవంతంగా పోరాడుతుంది.
మీరు కూడా రోజు
ఉదయం నీటిని తాగుతూ జీర్ణవ్యవస్థని, చర్మాన్ని
కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండండి.
శరీర అవయవాలలో కళ్ళు
అనేవి చాలా సున్నితమైనవి. అయితే కొందరికి కళ్ళ కింద నల్లటి చారలు ఇంకా కళ్ళు
ఉబ్బిపోయి కనిపించడం వలన ఈ సమస్యకి పరిష్కారం కోసం చాలా కష్టపడుతుంటారు. మరి ఈ
సమస్యకి ఆ నీరు శాశ్వత పరిష్కారం అని నిపుణులు అంటున్నారు. మరి ఆ నీరు ఏంటి? ఏవిధంగా తయారుచేసుకొని ఉపయోగించుకోవాలి అనే విషయాలను మనం ఇప్పుడు
తెలుసుకుందాం.
త్రిఫల నీరు ద్వారా
నల్లటి చారాలని, ఉబ్బుగా ఉండే కంటి సమస్యలను శాశ్వతంగా
పరిష్కారించుకోవచ్చు. అయితే త్రిఫల నీటిని తయారు చేయటానికి త్రిఫల పౌడర్ మరియు
నీరు అవసరం. రెండు గ్లాసుల నీటిలో రెండు టీ స్పూన్ల త్రిఫల పౌడర్ కలిపి
రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ
మిశ్రమాన్ని పది నిమిషాల పాటు వేడి చేసి, పూర్తిగా చల్లారే
వరకు వేచి ఉండాలి. ఈ నీరు గోరువెచ్చగా కూడా ఉండకూడదు.
త్రిఫల నీరు చల్లారిన
తర్వాత ఆ నీటిని వడగట్టి ఒక పాత్రలో ఉంచాలి. ఆ తర్వాత త్రిఫల నీటిని రెండు చేతులతో
తీసుకొని మీ కళ్లపై ఉంచాలి. ఈ నీటితో మీ కళ్ళను తడుపుతున్నప్పుడు మీరు కళ్ళు
తెరుచుకొని ఉండాలి. తర్వాత మీ కళ్ళను కొన్ని మార్లు మూసి తెరవాలి ఇలా చేయటం వలన మీ
కళ్ళలోని మలిన పదార్థాలు తొలగించబడతాయి. ఈ నీటితో మీ ముఖాన్ని మూడు సార్లు మర్దనం
చేసుకోవాలి అటు తర్వాత ముఖాన్ని శుభ్రంగా మంచి నీటితో కడుక్కొని, తుడుచుకోవాలి.
త్రిఫల అనే పౌడర్
ఆమ్ల, భిభిటకి మరియు హరిటకి అనే వాటితో తయారు చేయబడిన ఆయుర్వేద
పౌడర్. త్రిఫల నీరు మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమేకాకుండా, బాగా పనిచేయటానికి తోడ్పడుతుంది. ఎలాగంటే త్రిఫల నీటిలోని అంశాలు శరీరంలోని
రక్తాన్ని శుభ్రం చేయటమే కాకుండా, కళ్ళ ప్రక్కన లేదా
చుట్టూ ఉండే కండరాలను శక్తివంతం చేసి కళ్ళు బాగా పనిచేయటానికి తోడ్పడుతాయి.
ఈవిధంగా మీరు
కూడా త్రిఫల అనే పౌడర్ ఉపయోగించుకుంటూ సమస్య నుండి పూర్తిగా ఉపశమనం పొందండి.
తామర వ్యాధిని పోగొట్టే ఇంటి ఔషదాలు
తామర అనేది భయంకర
వ్యాధి కాదు ఫంగల్ ఇన్ఫెక్షన్ ల వలన కలిగే సాధారణ వ్యాధి. తామర అనేది చర్మం యొక్క
బాహ్యపొరపై ఫంగస్ ఇన్ఫెక్షన్ ల వలన కలిగే సాధారణ చర్మ వ్యాధిగా చెప్పవచ్చు.
చర్మంపై ఎర్రగా, వృత్తాకారంలో ఏర్పడి, చర్మ మధ్యలో దురదలను కలుగచేస్తుంది. సాధారణంగా బాహ్యమూలాలలో, కాళ్ళలో ఏర్పడుతుంది మరియు శరీర ఇతర భాగాలలో కూడా ఏర్పడవచ్చు. అయితే తామరని పోగొట్టడానికి ఈ ఇంటి ఔషదాలు చాలా
సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఆ ఇంటి ఔషదాలు ఏంటో మనం ఇప్పుడు
తెలుసుకుందాం.
ఉప్పు నీరు:
ఉప్పునీరు అద్భుతమైన
ఆస్ట్రిజెంట్ గా మరియు గాయాలను తగ్గించే ఔషదంగా పని చేస్తుంది. ఉప్పు నీరు
ప్రభావిత ప్రాంతాలలో ఇన్ఫెక్షన్ లను తొలగించే గుణాలను కలిగి ఉంటుంది. ప్రభావిత
ప్రాంతాన్ని ఉప్పు నీటిలో ఉంచండి లేదా సముద్రపు ఉప్పు నీటి పేస్ట్ ను ఇంఫెక్ష్సన్
లకు గురైన ప్రాంతంలో అప్లై చేయండి.
పచ్చిబొప్పాయి పండు:
తాజా బొప్పాయి పండు, గాయాలపై నూతన కణాలను ప్రభావిత పరచకుండా, నిర్జీవ కణాలను
తొలగిస్తుంది. తామర సోకటం వలన ఏర్పడే నిర్జీవ కణాలు చర్మ ఉపరితలంపై ఉంటాయి.
బొప్పాయి పండులో ఉండే పపాయిన్ మరియు కైమోపపాయిన్ ఎంజైమ్ లు వైరస్, ఈస్ట్ మరియు ఫంగస్ వంటి వాటి కణత్వచాలను నాశనం చేసి, ఇన్ఫ్లమేషన్ మరియు
కాలిన గాయాల నుండి ఉపశమనం కలిస్తుంది. తాజా బొప్పాయి పండు ముక్కను తీసుకొని, ప్రభావిత ప్రాంతాలలో రాయటం వలన ఉపశమనం పొందుతారు.
వెల్లుల్లి:
వెల్లుల్లి ఎజోయేన్ అనే
యాంటీ ఫంగల్ కారకాలను కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనం చాలా రకాల ఇన్ఫెక్షన్ ల నుండి
ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లిని దంచి నేరుగా తామర ప్రభావిత ప్రాంతాలలో అప్లై
చేయండి. దీనికి తేనె లేదా ఆలివ్ ఆయిల్ కలపటం వలన వెల్లుల్లి మరింత శక్తివంతంగా పని
చేస్తుంది. కనీసం రెండు వారాల వరకు రోజులో 2 నుండి 3 సార్లు ఈ విధంగా చేయటం వలన మంచి తామరవ్యాధి నుండి ఉపశమనం పొందుతారు.
కొబ్బరి నూనె:
తామరను తగ్గించుటలో
శక్తివంతంగా పని చేసే మరొక సహజ ఔషదం కొబ్బరి నూనె. ఇది ఫంగస్ ల యొక్క అతిధేయులను
తొలగిస్తుంది. కొబ్బరు నూనె లౌరిక్ ఆసిడ్ ను కలిగి ఉండి, తామరను కలుగచేసే
ఫంగస్ ను వినాశనం చెందిస్తుంది. అంతేకాకుండా, యాంటీ వైరల్ మరియు
యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉండే లౌరిక్ ఆసిడ్ అన్ని రకాల సుక్ష్మజీవులను చంపి
చర్మాని కాపాడుతుంది. కొన్ని నిమిషాల పాటు కొబ్బరి నూనెను తామర ప్రభావిత ప్రాంతాలలో
మసాజ్ లేదా మర్దన చేయండి.
కలబంద:
కలబంద యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్
మరియు యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలను కలిగి ఉంటుంది. చర్మ సమస్యలను తగ్గించుటలో
కలబంద శక్తివంతంగా పని చేస్తుంది ముఖ్యంగా తామర వ్యాధికి సమర్థవంతంగా పని చేస్తుంది.
కలబంద గుజ్జును తామర ఏర్పడిన ప్రాంతంలో పూసి, 20 నుండి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఎండిన తరువాత నీటితో కడిగి వేయండి. త్వరిత ఉపశమనం
పొందటానికి గానూ, రోజులో రెండు లేదా మూడు సార్లు ప్రభావిత
ప్రాంతాలలో అప్లై చేయండి.
ఈవిధంగా ఈ గృహ
చిట్కాలను మీరు కూడా పాటిస్తూ తామర నుండి ఉపశమనం పొందండి.
0 Comments