ఈ అలవాట్లు కనుక మిలో ఉంటె మీ మెదడు మందగించినట్లే


ఈ అలవాట్లు కనుక మిలో ఉంటె మీ మెదడు మందగించినట్లే

            మనకి ఉండే కొన్ని అలవాట్ల కారణంగా మన మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతుంది. అందుకే మిలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది అంటే దానికి కారణం మిలో ఉండే ఏదో ఒక అలవాటు అని గుర్తించండి. మరి జ్ఞాపక శక్తిని తగ్గించే ఆ అలవాట్లు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పొగత్రాగే అలవాటు:
                  ధూమపానం జ్ఞాపక శక్తిని కాలక్రమేనా తగ్గిస్తుంది మరియు సామాన్య ప్రజ్ఞాన సామర్థ్యాన్ని కూడా తగ్గించి వేస్తుందని అనేక అధ్యయానాలలో నిరూపించబడింది. నికోటిన్ జ్ఞాపక శక్తిని పెంచుతుందని చాలా చోట్ల వినే ఉంటాము కానీ, దీన్ని సమర్థించే నిరూపణలు ఇప్పటి వరకు కనుగొనబడలేదు.

అధిక మద్యపానం:
                    అధిక మద్యపానం జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తుంది, అనగా ఈ అలవాటు వలన కేవలం రాత్రి జరిగే సంఘటనలు మాత్రమే గుర్తుండేలా చేస్తుంది. అదేవిధంగా, రోజు మద్యపానం అలవాటు వలన జ్ఞాపక శక్తిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

పోషకాహర లోపం:
                   మన శరీరానికి ఇంధనం కావాలి, అదేవిధంగా మన మెదడుకు కూడా టాంక్ నిండా ఇంధనం అవసరం. ఇంధన స్థాయిలు తగ్గితే జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. మనం అధికంగా అలసటగా ఉన్నపుడు లేదా ఆకలిగా ఉన్నపుడు మన జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది.

జంక్ ఫుడ్:
                     మెదడులో ఉండే రసాయనాలను జంక్ ఫుడ్ ప్రభావిత పరచి డిప్రెషన్ మరియు ఉద్రేకత వంటి లక్షణాలుగా బహిర్గత పరుస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ వారు జరపిన అధ్యయనాల ఫలితాలుగా వెల్లడించారు. వీటి వలన కలిగే ఒత్తిడి అభిజ్ఞా వ్యవస్థ పనితీరును ప్రభావిత పరచి, అభ్యాసన సామర్థ్యాన్ని మరియు జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది.

                మీరు కూడా వీటికి దూరంగా ఉంటూ మీ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోండి.







              



Post a Comment

0 Comments