ఈ సహజ సిద్దమైన బాడీలోషన్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది


ఈ సహజ సిద్దమైన బాడీలోషన్ మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది

                     శరీరం మృదువుగా ఉండాలంటే చాలా మంచి మార్కెట్లో లభించే బాడీ లోషన్‌ లు ఉపయోగిస్తుంటారు.  అయితే ఎంతో ఖర్చు పెట్టి ఈ రసాయనాలు కలిగి ఉండే లోషన్ కంటే ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈ లోషన్ చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మం అందంగా అవుతుందని చెబుతున్నారు. మరి ఆ బాడీలోషన్ ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


               ఒక మూడు టేబుల్‌ స్పూన్ల రోజ్‌ వాటర్‌కి, ఒక స్పూను గ్లిజరిన్‌, రెండు టీ స్పూనుల నిమ్మరసం కలపండి. ఆ మిశ్రమాన్ని చిన్న సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. దీనిని అసరమైనప్పుడు తీసి వాడుకుంటూ ఉంటే, చర్మం పొడి బారకుండా, మృదువుగా ఉంటుంది.

           ఇదేవిధంగా కప్పు రోజ్‌ వాటర్‌లో టీ స్పూను బొరాక్స్‌ పొడినీ, రెండు టీ స్పూన్ల వేడి చేసిన ఆలివ్‌ ఆయిల్‌ని బాగా కలపండి. దగ్గరలోనిమార్కెట్లో లావెండర్‌ వాటర్‌ దొరుకుతుంది. ఆ లావెండర్‌ వాటర్‌ ని ఈ మిశ్రమంలో కలిపి బాగా కలుపుకొని కాసేపటి తరువాత వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

               ఇంకా  సబ్బుని చిన్న చిన్న ముక్కల్లా చేసి పొడిగా చేసుకొని, ఒక మూడు టీ స్పూన్ల నిండా దాన్ని తీసుకోవాలి. దానిని పావు కప్పు నీళ్లలో కలిపి వేడి చేసి, నాలుగు స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌నీ, టీ స్పూను గ్లిజరిన్‌నీ దాన్లో వేసి బాగా కలపాలి. తయారైన మిశ్రమాన్ని ముఖ వర్ఛస్సుకు రాసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు.

           కొన్ని తులసి ఆకులను మెత్తగా చేసి అందులో అరచెంచా పాలమీగడ, చిటికెడు పసుపు కలిపి రాత్రిపూట మోచేతులూ, మోకాళ్లకూ మర్దన చేసుకోవాలి. మర్నాడు చల్లటి నీళ్లతో శుభ్రపరచుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

          సగానికి కోసిన నిమ్మచెక్కలతో మోచేతులకు మర్దన చేసుకోవాలి. ఇలా రెండు మూడు రోజులకోసారి చేస్తుంటే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. అలానే తేనెలో పంచదార కలిపి నల్లగా ఉన్న చోట రుద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

                     మీరు కూడా ఈ సహజ సిద్దమైన బాడీలోషన్ తయారుచేసుకొని మీ చర్మాన్ని అందంగా చేసుకోండి.
            
 ఈ పిండిపదార్తాలు తింటే చాలు బరువు తగ్గించుకోవచ్చు


             బరువు పెరిగినప్పుడు ఏది తినాలన్న చాలా భయంతో ఉంటారు. అయితే కొన్ని రకాల పిండి పదార్తాలు బరువు తగ్గించడంలో సహాయపడతాయని అవి తినడానికి ఎలాంటి భయం అవసరం లేదని చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని రకాల పిండి పదార్తలలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. మరి బరువు తగ్గించుటకు సహాయపడే ఆ పిండిపదార్తాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బార్లీ:
                సగం కప్పు వండిన బార్లీ, 97 క్యాలోరీలను, 22 గ్రాముల పిండిపదార్థాలను మరియు 3 గ్రాముల ఫైబర్ లను కలిగి ఉంటుంది. అయితే బార్లీ, శరీర రక్తంలో చక్కెర స్థాయిలను, నెమ్మదిగా పెంచి, ఎక్కువ సమయం పాటూ, ఆకలి అవ్వకుండా చూస్తుందని పరిశోధనలో తేలింది.  అయితే  బార్లీ దినుసులు ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉండి, రోజులో 20 నుండి 25 శాతం వరకు ఫైబర్ లను అందిస్తాయి.

బఠానీ:
            సగం కప్పు బఠానీలు 67 క్యాలోరీలను, 12.5 గ్రాముల పిండి పదార్థాలను మరియు 4.5 ఫైబర్ లను కలిగి ఉంటుంది. అయితే సగం కప్పు బఠానీలను రోజు తినటం వలన 12 శాతం జింక్ ను పొందవచ్చు. ఇవి జలుబు వంటి కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తాయి. ఆకలిని ప్రేపించే 'లేప్టిన్' హార్మోన్ ఉత్పత్తిని, ఈ మూలకం తగ్గించి వేస్తుంది. ఈ హార్మోన్ మీ పొట్ట నిండినట్టుగా అనిపించిన సమయంలో, ఈ సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది.

బీన్స్:
             సగం కప్పు తయారుగా ఉన్న, తక్కువ సోడియం కలిగి ఉన్న బ్లాక్ బీన్స్: 109 క్యాలోరీలు, 20 గ్రాముల పిండి పదార్థాలను, 8 గ్రాముల ఫైబర్ లను కలిగి ఉంటాయి.  బీన్స్ తినే వారిలో నడుము ప్రాంతం విస్తరించే అవకాశాలు 23 శాతం వరకు తగ్గుతాయని మరియు 22 శాతం వరకు ఊబకాయానికి గురి చేసే అవకాశాలను తగ్గించి వేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. వివిధ రకాల బీన్స్, వేరు వేరు స్థాయిలలో ఫైబర్ ను కలిగి ఉంటాయని, మరియు శరీరానికి కావాల్సిన ప్రోటీన్ మరియు ఐరన్ లను కలిగి ఉంటాయని తెలిపారు. కానీ, వీటిని ఎంచుకునే సమయంలో సోడియం స్థాయిలు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.

             మీరు కూడా మీ ఆహారంలో ఈ పిండిపదార్తాలు ఉండేలా చూసుకొని మీ బరువును తేలికగా తగ్గించుకోండి.
















Post a Comment

0 Comments