10+ useful tips to health


కాళ్ళ నొప్పులని తగ్గించే ఇంటి చిట్కాలు


            కాళ్ళ నొప్పి అనేది చాలా సాధారణ సమస్యగా చెప్పవచ్చు. కాలి వేళ్ళు, మోకాలి ప్రాంతం, మడిమ లేదా పాదం వంటి ఏ ప్రాంతంలో అయిన రావచ్చు. వృద్దాప్యం, అసౌకర్యంగా ఉండే షూ, ఎక్కువ సమయం పాటూ నడవటం లేదా నిలబడటం, మినరల్ లోపం, మధుమేహం మరియు ఇతర ఆరోగ్య పరిస్థితుల వలన కాళ్ళలో నొప్పి రావచ్చు. ఇలాంటి నొప్పులను కొన్ని రకాల సహజ పద్దతులు త్వరగా ఉపశమనం అందిస్తాయి. మరి ఆ సహజ మార్గాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
          
వెనిగర్:
           బెణుకులు మరియు గాయాల వలన కలిగే ఇన్ఫ్లమేషన్ ల వలన కలిగే అసౌకర్యాల నుండి వెనిగర్ ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ లో వేడినీటిని తీసుకొని, రెండు చెంచాల వెనిగర్ ను అందులో కలపండి. దీనితో పాటుగా కొద్దిగా ఎప్సం సాల్ట్ ను కూడా కలపండి. ఈ మిశ్రమంలో దాదాపు 20 నిమిషాల పాటూ కాళ్ళను నానబెట్టండి. ఇలా చేయటం వలన కాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు.

ఎప్సం సాల్ట్:
             నయం చేసే గుణాలను కలిగి ఉండే ఎప్సం సాల్ట్ కాళ్ళలో కలిగే నొప్పుల నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది. ఒక బకెట్ లో వేడి నీటిని తీసుకొని అందులో రెండు నుండి మూడు చెంచాల ఎప్సం సాల్ట్ ను కలపండి. తరువాత దీనిలో 10 నుండి 15 నిమిషాల పాటూ మీ కాళ్ళను అందులో ఉంచండి. కాళ్ళను బయటకి తీసిన తరువాత తేమను అందించే ఉత్పత్తులను పాదాలకు పూయండి. ఎందుకంటే ఎప్సం సాల్ట్ కాళ్ళను పొడిగా మారుస్తుంది. ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

ఐస్:
        కాళ్ళలో కలిగే నొప్పి మరియు వాపులను తగ్గించే శక్తివంతమైన పద్దతిగా ఐస్ థెరపీ పేర్కొనవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఐస్ ముక్కలను ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో ఉంచి, దానితో నొప్పిగా ఉన్న ప్రాంతాలలో వలయాకార రూపంలో మసాజ్ చేయండి. ఇలా ఐస్ బ్యాగ్ తో 10 నిమిషాల కంటే ఎక్కువగా చేయకూడదు ఎందుకంటే అధిక సమయం పాటూ చేయటం వలన చర్మం మరియు నరాలు ప్రమాదానికి గురవవచ్చు.

లవంగాల నూనె:
          ఈ నూనె  తలనొప్పి, కీళ్ళనొప్పులు, అథ్లెట్ లలో కలిగే కాళ్ళ నొప్పులు, గోళ్లలో కలిగే ఇన్ఫెక్షన్ మరియు కాళ్ళలో కలిగే నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా నొప్పిగా అనిపించిన వెంటనే లావంగాల నూనెను అప్లై చేయటం వలన తక్షణ ఉపశమనం పొందుతారు. ఈ నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ సరిగా జరిగి, కండరాలు విశ్రాంతికి గురవుతాయి. మంచి ఫలితాల కోసం, రోజులో కొన్ని సార్లు లవంగాల నూనెను అప్లై చేయండి.

           ఒకవేళ కనుక మీకు కాళ్ళ నొప్పులు అనేవి బాధిస్తే ఈ సహజ చిట్కాలు పాటిస్తూ ఆ నొప్పి నుండి పూర్తిగా ఉపశమనం పొందండి.

 కాలుష్యం నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవి పాటించాలి


               రోజు రోజుకి పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వలన అనేక మంది చాలా రోగాలతో సతమతవుతున్నారు. ఈ వాతావరణ కాలుష్యంలో ఉండే విషపదార్తాలు శరీరంలోకి చేరడం వలన చర్మ వ్యాధులే కాకుండా వివిధ రకాల ప్రాణాంతక వ్యాధులు వస్తూ బాధిస్తున్నాయి. మరి కాలుష్యం నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఆహారంలో ఇవి తప్పక ఉండాలని చెబుతున్నారు. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ సి:
               విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, పైనాపిల్, జామ, కివీ, ఉసిరి, టమాటోలు, బొప్పాయి, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఎక్కువగా తినాలి. విటమిన్ సి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. దీంతో శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది. వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు. 

అల్లం:
           అల్లంలో జింజెరోల్ అనబడే రసాయనం ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. కనుక వ్యాధుల నుంచి మనకు రక్షణనిస్తుంది.

           ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే వాల్ నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు, చేపలు వంటి ఆహారాలను తినాలి. ఇవి కాలుష్యం బారిన పడే మన శరీరాన్ని రక్షిస్తాయి. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపేస్తాయి.

           రాత్రిపూట ఒక గ్లాస్ పాలలో పసుపు కలుపుకుని తాగాలి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తుంది.

             బాదం పప్పు, జీడిపప్పు, పాలకూర, గుమ్మడికాయ విత్తనాలు, పెరుగు వంటి ఆహారాల్లో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించవచ్చు.

             మీరు కూడా ఇవి తప్పకుండ పాటిస్తూ కాలుష్యం నుండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
              



 బాదం పప్పుజీడిపప్పుపాలకూరగుమ్మడికాయ విత్తనాలుపెరుగు వంటి ఆహారాల్లో మెగ్నిషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించవచ్చు.







     

Post a Comment

0 Comments