10+ Health Tips you should know

ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసే దివ్య ఔషధం



 

            ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటూ అందాన్ని కాపాడుకోవాలనుకుంటారు. అందం, ఆరోగ్యం రెండు కావాలంటే ఆహారంలో తప్పకుండ పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. అయితే సహజంగా అందరికి దొరికే దీనివల్ల ఆరోగ్యానికి అందానికి ఎన్నో లాభాలు ఉన్నాయని తెలిసింది. మరి అది ఏంటి? ఏవిధంగా సహాయపడుతుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

              ప్రతి ఇంట్లో చింతపండు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ చింతపండు అందాన్ని కూడా రెట్టింపు చేస్తుందని నిపుణులు చెప్పుతున్నారు. అయితే సిట్రిక్ యాసిడ్‌ గుణాలు కలిగున్న చింతపండు వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ఉపయోగాలున్నాయి.  దీన్నికడుపు ఉబ్బరం, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు. ఇంకా ఆకలి మందగించినవారు ఉదయాన్నే 4-5 చెంచాల చింతపండు రసాన్ని సేవిస్తే ఫలితం ఉంటుంది.

 

                 శరీరంలోని వాపులు, నొప్పులకు చింతపండు రసాన్ని రాసి మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దెబ్బల వల్ల వచ్చిన వాపులు, బెణుకులకు చిక్కటి చింతపండు గుజ్జు ఉడికించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు వాటిపై పూస్తే వెంటనే తగ్గుతాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది.

 

            చింతపండు కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా  చర్మ సౌందర్య సాధనంగానూ ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై మచ్చలు, గాయాలను మాన్పడానికి సహాయపడుతుంది. అంతేకాదు చర్మం కాంతివంతంగా మారడానికి కూడా తోడ్పడుతుంది. దీని వల్ల ఎలాంటి హాని ఉండదు.

 

          ఫేస్‌వాష్‌తో ముందు ముఖం కడుక్కున్న తర్వాత చింతపండు వినియోగిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో మీకే తెలుస్తుంది. ఎందుకంటే చింతపండు రసం ముఖానికి రాసి కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

 

         ముందుగా చింతపండు, పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడిగితే ముఖంపై ముడతలు పోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

 

           ముఖంపై మృత కణాలను తొలగించడానికి చింతపండు రసం పాలతో కలిపి స్రక్బ్ తో  రాయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం పైన ఉండే మృత కణాలను తొలగిపోతాయి.

 

           వేసవి కాలంలో ఎండ నుంచి రక్షించే స్కిన్ టోనర్‌గానూ చింతపండు చాల ఉపయోగపడుతుంది. అయితే చింతపండు రసానికి, రోజ్ వాటర్ కలిపిన స్ప్రే బాటిల్‌ను ఫ్రిజ్‌‌లో ఉంచి రోజు పూసుకుంటే ఎండ నుంచి రక్షణ లభిస్తుంది.

 

          చర్మం మృదువుగా అవ్వాలంటే పసుపు, చింతపండు రసం కలిపి రాస్తే చర్మం మృదువుగా ఉండటమే కాకుండా తాజాగా ఉంటుంది.

 

               కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గాలంటే చింతపండు రసంలో పాలు, పసుపు కలిపి రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే దాదాపు మచ్చలు అన్ని తగ్గిపోయి అందంగా కనిపిస్తారు.

 

                ఈవిధంగా చింతపండుని ఉపయోగించుకుటూ మీరు కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి.

          ఆరోగ్యానికి మేలు చేసే ఆ మొక్క ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

 

                  ప్రపంచంలో  దివ్య ఔషదాలు కలిగిన అనేక రకాల మొక్కలు ఉన్నాయి. అయితే నాచు జాతికి చెందిన ఈ మొక్క ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే  ఆశ్చర్యపోతారు. మరి ఏంటి ఆ నాచు మొక్క గొప్పతనం? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాని వల్ల ఉన్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

                     ఇది స్పిరులినా అనే నాచు జాతికి చెందిన నీటి మొక్క. దీన్ని భూమిపై మొక్కల ఆవిర్భావానికి తొలి రూపంగా భావిస్తారు. అయితే ఆదిమ మానవులు ఆహారంలో ఇది భాగంగా ఉండేది. ఇంకా చారిత్రకంగా వేల సంవత్సాల నుంచి వాడుకలో ఉన్న ఈ నాచు మొక్క ఆహార వనరుగా ఉపయోగపడుతూనే ఉంది. ఇప్పటికీ అనేక దేశాల ప్రజలు తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు.

 

            త‌ల్లిపాల‌లో ఉన్న‌ పోష‌కాలు ఈ మొక్క‌లో ఉంటాయి. అందుకే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ దీన్ని తల్లిపాల తర్వాత అత్యంత పోష‌కాలు క‌లిగిన ఆహారంగా పేర్కొంటారు. ఎందుకంటే స్పిరులినా పొడిలో కాల్షియం సాధారణ పాల‌లో కన్నా 26 రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో ఎముక‌లు పటిష్టంగా ఉంటాయి.పెరుగుద‌ల‌కు అవ‌స‌ర‌మైన అమైనో అమ్లాలు, ఐర‌న్‌, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ స‌మృద్ధిగా ఉంటాయి. ఇంకా ర‌క్తాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో క్లోరోఫిల్ బాగా ప‌నిచేస్తుంది.

 

             అంతేకాకుండా గుండె సంబంధ వ్యాధులను, వాపులు, నొప్పులు నివారిస్తుంది. ఇది తినడం వలన జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది దానితోపాటు శ‌రీరంలోని హార్మోన్ల ప‌నితీరు సక్రమంగా ఉంటుంది. ఇంకా శరీర బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషదంగా పనిచేస్తుంది. ఎందుకంటే  ర‌క్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ అధిక కొవ్వును క‌రిగించి శ‌రీరంలోని వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు పంపుతుంది. 

 

             మన దేశంలోనే అధికంగా ఉత్పత్తి అయ్యే ఈ నాచు జాతి మొక్కను మీరు కూడా ఆహారంగా తింటూ మీ ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోండి.

 

 

           

               ఆరోగ్యానికి పల్లీలు చేసే మేలు తెలిస్తే తినకుండా ఉండలేరు

 

             పల్లీలలను మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తాము. కొందరు పల్లి నుండి తయారైన నూనెలను వంటలో ఉపయోగిస్తుంటారు. అయితే పల్లీలు తినడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. మరి పల్లీలు ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది:

              వేరుశెనగల్లో మోనోశాచ్యురేటెడ్ ఫాలీ అన్ శ్యాచురేటెండ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఓలిక్ యాసిడ్ రక్తంలో ఎల్ డిఎల్ అనే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి, మంచి కొలెస్ట్రాల్ ఎచ్ డిఎల్ ను పెంచుతుంది. అందువల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇవి కరోనరీ ఆర్టీ డిసీజ్ ను నివారిస్తుంది. స్ట్రోక్ నివారించి హెల్తీ లిపిడ్ ప్రొఫైల్ ను ప్రోత్సహిస్తుంది.

 

స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది:

             వేరుశెనగల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు మినిరల్స్, స్ట్రోక్ మరియు ఇతర హార్ట్ సమస్యల రిస్క్ ను తగ్గిస్తుంది. పల్లీలలో ఉండే ట్రైప్టోఫోన్ డిప్రెషన్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. అదే విధంగా గుప్పెడు వేరుశెనగలు స్ట్రోక్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

 

డయాబెటిస్ నివారిస్తుంది:

           పీనట్స్ లో మ్యాంగనీస్ మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వు మరియు కార్బోహైడ్రేట్ ల విషయంలో ముఖ్య పాత్ర పోషించి, మెటబాలిజంకు సహాయపడుతాయి. క్యాల్షియం గ్రహించడం మరియు బ్లడ్ షుగర్ రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతాయి. పీనట్స్ తినడం వల్ల 21 శాతం డయాబెటిస్ రిస్క్ ఉండదని పరిశోధనల్లో కనుగొన్నారు. ఎవరైతే డయాబెటిస్ తో బాధపడుతున్నారో , వారు కొద్దిగా పల్లీలు తినడం అలవాటు చేసుకోండి. సందేహం ఉంటే డాక్టర్ ను అడిగి సలహాలు తీసుకోండి.

 

చర్మానికి మంచిది:

               చర్మ సంరక్షణకు పీనట్స్ చాలా మంచిది. పీనట్స్ లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు రివర్ట్రోల్ చర్మానికి కావల్సిన తేమను అందించి, చర్మం తేమగా, కాంతివంతంగా మార్చుతుంది.

 

బరువు పెరగడానికి నివారిస్తుంది:

               ఇతర స్నాక్స్ తో పోల్చితే వేరుశెనగపప్పులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కాబ్టి, వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల ఇతర హైక్యాలరీ, ఫ్యాట్ ఫుడ్స్ తినాలనిపించదు. దాంతో మీరు బరువు పెరగరు. వింటర్లో బరువు పెరగకుండా నివారిస్తుంది.

 

క్యాన్సర్ నివారిణి:

           పినట్స్ వంటి లెగ్యూమ్స్ లో ఫైటో స్టెరోల్ బీటా స్టెరోల్ అధికం. ఈ ఫైటో స్టెరోల్స్ లో క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి ట్యూమర్ గ్రోత్ ను నివారిస్తాయి. పీనట్స్ తినే స్త్రీ మరియు పురుషుల్లో వ 27 శాతం నుండి 58 శాతం వరకూ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదని యునైటెడ్ స్టేట్స్ పరిశోధనల్లో కనుగొనబడినది. ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ తగ్గిస్తుంది.

 

             మీరు కూడా ఆహారంలో భాగంగా పల్లెలను చేర్చుకొని మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.

 

 

 

 

 

 

 

 

 

 

 

  

 

 

 

 

 

 

 

 


Post a Comment

0 Comments