10+ skin tips you should know


చర్మాన్ని ఆ నూనె ఏవిధంగా కాపాడుతుందో తెలిస్తే షాకే



                అందమైన చర్మం పొందడానికి చాలా మంది  రసాయనాలు ఉండే క్రిములను వాడుతుంటారు. ఈవిధంగా రసాయనాలు ఉండే వాటి వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే చర్మాన్ని కాపాడుకోవడం కోసం సహజ సిద్దమైన నూనెలు వాడుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. మరి నూనెలు వాడెప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఏవిధంగా వాటిని ఉపయోగించుకోవాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ మాయిశ్చరైజర్:
               సాధారణంగా, మార్కెట్లో లభించే తేమను అనించే ఉత్పత్తుల కన్నా, కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్'గా పని చేస్తుంది. కొబ్బరి నూనెనుతో, శరీరంపై మసాజ్ చేయటం వలన, ఇది అంతర్భాగంలోని కణాలకు బలాన్ని చేకూర్చి, మంచి మాయిశ్చరైజర్'గా పని చేస్తుంది.

శరీర మాయిశ్చరైజర్:
              సమాన మొత్తంలో కొబ్బరి నూనె మరియు బాడీ లోషన్'ను కలిపి, స్నానం చేసిన తరువాత శరీరానికి రాయండి. మీ చర్మం నుండి మంచి వాసన రావటానికి ఈ మిశ్రమంలో సుగంధ తైలంను కూడా కపపవచ్చు.

సహజ ఎక్సోఫోలియెంట్:
               ఒక కప్పు బాదం నూనెను, మరియు సముద్రపు ఉప్పును కలిపి, ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల సుగంధ తైలంను కలపండి. స్నానానికి ముందుగా, ఈ మిశ్రమంతో మసాజ్ చేయటం వలన మంచి అనుభూతిని పొందుతారు. ఇది సహజ ఎక్సోఫోలియెంట్'గా పని చేస్తుంది.

షేవింగ్:
            రోజు షేవింగ్ చేయటానికి, మార్కెట్'లలో లభించే క్రీమ్'లు రసాయనాలతో తయారు చేయబడతాయి. అయితే కాళ్ళపై లేదా బాహ్య మూలాలో షేవ్ చేసేటపుడు ఈ ఉత్పత్తులకు బదులుగా కొబ్బరి నూనెను వాడండి. ఎందుకంటే కొబ్బరి నూనె యాంటీ- మైక్రోబియల్ గుణాలను కలిగి ఉన్నందు వలన, షేవ్ చేసిన తరువాత మంటలు, దురదలు కలగవు.

సుగంధ ద్రవ్యాలు:
           మనం వాడే సుగంధ ద్రవ్యాలు కృత్రిమ రసాయనాలను కలిగి ఉంటాయి, వీటి వలన చర్మానికి ప్రమాదం కలగవచ్చు. కావున, బాదం నూనె, కొన్ని చుక్కల సుగంధ తైలంను కలిపిన మిశ్రమాన్ని, మీ చర్మానికి వాడటం వలన మంచి వాసనను వెదజల్లుతుంది. దీని వాడకం వలన ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలగవు.

మేకప్ తొలగించుటకు:
            మేకప్ తొలగించుటకు బాదం నూనె, కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్'లను వాడవచ్చు. సాధారణంగా మేకప్ తీసేయటానికి వాడే రసయానాల వలన చర్మంపై సమస్యలు కలగవచ్చు. కానీ, సహజ నూనెలు మేకప్'ను సహజంగా తొలగించటమే కాకుండా, ఎలాంటి ప్రమాదాన్ని కలుగ చేయవు. 

             ఈవిధంగా మీరు కూడా నూనెను ఉపయోగిస్తూ మీ చర్మాన్ని కాపాడుకోండి.

 చర్మాన్ని కాలుష్యం నుండి రక్షణ కల్పించే చిట్కాలు


              ప్రస్తుత వాతావరణ కాలుష్యం వలన చాలా మంది చాల రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజు కాలుష్యానికి గురైన వారు ఆరోగ్యం తో పాటుగా చర్మ సమస్యలతో కూడా సతమతమవుతున్నారు. పెరుగుతున్న కాలుష్యంలో మన చర్మాన్ని కాపాడుకోవాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు అనేవి పాటిస్తే చాలు మరి ఆ చిట్కాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సన్ స్క్రీన్:
          ఎండలోకి వెళ్ళే 20 నిమిషాల ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటం వలన చర్మం పొడిగా మారదు. కావున బయటకి వెళ్ళే 10 నిమిషాల ముందు మీ చర్మానికి తేమభరిత లోషన్ లను అప్లై చేయండి. ముఖ్యంగా మధ్యాన్నం 12 నుండి 3 గంటల మధ్యలో బయటకి వెళ్ళకండి. ఈ సమయంలో సూర్యరశ్మి తీవ్రంగా ఉంటుంది.

నీరు:
       మీ చర్మానికి అంతర్గతంగా చాలా నీరు అవసరం కావున నీటిని ఎక్కువగా తాగటానికి ప్రయత్నించండి. కావున రోజులో కాఫీ, టీలకు బదులుగా కనీసం 8 గ్లాసుల నీటిని తాగండి. ఇంకా  నీటికి నిమ్మరసం జోడించటం వలన  మంచి ప్రయోజనాలను పొందవచ్చు.

స్క్రుబ్:
            ప్రతి మహిళ వారంలో కనీసం ఒకసారైన వారి ముఖాన్ని స్క్రుబ్ చేయటం అవసరం. ఇలా చేయటం వలన చర్మంలోని నిర్జీవ కణాలతో పాటూ, దుమ్ము ధూళి కణాలు తొలగించబడతాయి. సాధారణ స్క్రుబ్ కు బదులుగా సన్ స్క్రీన్ స్క్రుబ్ ను వాడితే మంచి ఫలితం ఉంటుంది.

క్లీన్సర్:
            కాలుష్యం వలన మీ చర్మంపై నిండి ఉన్న దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగించుటకు రోజు ముఖాన్ని కడగండి. ఎల్లాపుడు మీతో కాటన్ బాల్స్ మరియు క్లీన్సర్ లను బ్యాగ్ లో ఉంచుకొని వెళ్ళండి. అంతేకాకుండా మీరు పడుకోటానికి ముందు చర్మాన్ని శుభ్రపరచుకుంటే మంచిది.

ఆహారం:
            ఆరోగ్యకర మరియు మెరిసే చర్మం కోసం నట్స్, ఫ్రూట్ జ్యూస్, ఫిష్, పచ్చని ఆకుకూరలను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోండి. పోషకాలు గల ఇలాంటి ఆహార ప్రణాళికల వలన మీ శరీరం కోల్పోయే నీటిని మాత్రమే కాకుండా, పోషకాలతో పాటుగా మెరిసే చర్మాన్ని అందిస్తాయి.

          మీరు కనుక ఇవి తప్పకుండ పాటిస్తే కాలుష్యం నుండి మీ చర్మాన్ని కాపాడుకోవచ్చు.















Post a Comment

0 Comments